Nani: రాజకీయ నేతగా మారిన నాని.. ఎన్నికల సీజన్‌ అంటూ పోస్ట్‌

నాని తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా ప్రచారంతో నాని సందడి చేస్తున్నారు.

Published : 18 Nov 2023 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో నాని (Nani) తాజాగా పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. దీనికి అభిమానులు కూడా ఫన్నీగా కామెంట్స్‌ పెడుతున్నారు. నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నాని ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగానే తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇది ఎన్నికల సీజన్‌. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు.. డిసెంబర్‌ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని క్యాప్షన్‌ రాశారు. ఇంకా ఇలాంటి సరదా ప్రచారాలు చాలా చేస్తానని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు ‘ఈ గెటప్‌లోనూ చాలా బాగున్నారు’, ‘సినిమా ప్రమోషన్స్‌ను మీరు ప్రత్యేకంగా చేస్తారు’ అంటూ పొగిడేస్తున్నారు.

థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

ఇక ‘దసరా’తో సూపర్‌ హిట్‌ను అందుకున్న నాని అదే జోష్‌తో ‘హాయ్ నాన్న’లో నటించారు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందింది. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంతో శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేయగా అవి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. నాని సరసన మృణాల్ ఠాకూర్‌ నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిసున్నారు. తాజాగా దీని గురించి నాని మాట్లాడుతూ.. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారన్నారు. ఇలాంటి అందమైన స్క్రిప్ట్‌లో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని చెప్పారు. తన కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ఈ సినిమా ఓవర్సీస్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ నవంబర్‌ 18 నుంచి ప్రారంభం అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని