Tiger3: థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

‘టైగర్‌-3’ (Tiger 3) చిత్రబృందం అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మంబయిలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌కు వెళ్లి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.

Updated : 18 Nov 2023 11:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్యకాలంలో సినిమా తారలు థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ట్రెండ్‌గా మారింది. తాజాగా బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌-కత్రినా కూడా ఇలానే ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడిపాడారు. వీళ్లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్‌-3’. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్‌ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ ఎక్స్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నాగ చైతన్య.. జాబ్‌ లేదంటూ ఆన్సర్‌!

ఈ సందర్భంగా సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘నేను యాక్షన్ హీరోగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. అభిమానులు నాపై ఇంత అభిమానం చూపించడం అదృష్టంగా భావిస్తున్నా. ‘టైగర్-3’ విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి జానర్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. యాక్షన్‌ సినిమాల్లోనూ కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. ఇది హ్యాట్రిక్‌ విజయంతో సమానం. దీని కోసం ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టిపెట్టాను’ అని అన్నారు. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని