Nani: ‘హాయ్‌ నాన్న’ మేనిఫెస్టో.. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ టికెట్‌పై డిస్కౌంట్‌..!

ఎన్నికల ఫీవర్‌ను దృష్టిలో ఉంచుకుని ‘హాయ్‌ నాన్న’ ప్రమోషన్స్‌ను విభిన్నంగా మొదలుపెట్టారు నటుడు నాని. రాజకీయ నాయకుడిగా మారి.. కొన్ని సరదా హామీలు ఇచ్చారు.

Published : 18 Nov 2023 19:44 IST

హైదరాబాద్‌: నాని (Nani) నటించిన సరికొత్త చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈసినిమా డిసెంబర్‌ 7న దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘హాయ్‌ నాన్న’ ప్రమోషన్స్‌ను నాని మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఎన్నికల ఫీవర్‌ను దృష్టిలో ఉంచుకుని.. సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం విభిన్నంగా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా నాని రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు.

‘హాయ్‌ నాన్న’ అనే పార్టీకి తాను అధ్యక్షుడినని చెప్పారు. ఈ మేరకు ఓ సరదా మేనిఫెస్టో విడుదల చేశారు. ‘యువత రీల్స్ చేసేందుకు వీలుగా సెల్‌ఫోన్లు, లైటింగ్ సెటప్‌లు కిట్స్ రూపంలో పంచుతాం. వరల్డ్ కప్‌ ఫైనల్‌కి టికెట్ డిస్కౌంట్‌లో ఇప్పిస్తాం’ అంటూ ఆయన పలు సరదా హామీలు ఇచ్చారు. అనంతరం ‘బాధ్యతతో ఓటు వేయండి. అలాగే బాధ్యతాయుతంగా సినిమా చూడండి’ అని పిలుపునిచ్చారు.

Vaishnav Tej: వరుణ్‌ - లావణ్య వెడ్డింగ్‌ పార్టీ.. రీతూవర్మ రావడానికి కారణమదే: వైష్ణవ్ తేజ్‌

‘దసరా’ తర్వాత నాని నటిస్తోన్న చిత్రమిదే. శౌర్యువ్‌ దర్శకుడు. ఇందులో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని