Vaishnav Tej: వరుణ్‌ - లావణ్య వెడ్డింగ్‌ పార్టీ.. రీతూవర్మ రావడానికి కారణమదే: వైష్ణవ్ తేజ్‌

తన తదుపరి చిత్రం ‘ఆదికేశవ’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు వైష్ణవ తేజ్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 19 Nov 2023 01:55 IST

హైదరాబాద్‌: నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej) - నటి లావణ్య త్రిపాఠి (Lavanya Triapti) వివాహం ఇటలీ వేదికగా ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన పలు వేడుకల్లో వధూవరుల కుటుంబసభ్యులతోపాటు నటి రీతూవర్మ సైతం పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఇచ్చిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో రీతూవర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనిపై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆ కుటుంబానికి చెందిన ఓ హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది.

ఇదిలా ఉండగా ఆయా కథనాలపై నటుడు వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) తాజాగా స్పందించారు. వరుణ్‌-లావణ్య వెడ్డింగ్ పార్టీలో రీతూవర్మ పాల్గొనడానికి గల కారణాన్ని తెలియజేశారు. లావణ్య త్రిపాఠికి రీతూ మంచి స్నేహితురాలని.. ఆ కారణంతోనే ఆమె పెళ్లి వేడుకల్లో సందడి చేసిందన్నారు. అంతకు మించి ఏమీ లేదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అనంతరం ఆయన తన మామయ్యలు నటించిన ‘ఖైదీ’, ‘బద్రి’ రీమేక్స్‌లో నటించాలని ఉందన్నారు.

దీని కోసమే మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. పాయల్ భావోద్వేగం

సినిమాల విషయానికి వస్తే.. వైష్ణవ్‌ తేజ్‌ నటించిన సరికొత్త చిత్రం ‘ఆదికేశవ’. ఆయనకు ఇది 4వ సినిమా. ఇందులో రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడు. శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌. మలయాళ నటుడు జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా నవంబర్‌ 24న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని