Nani: అలా చేస్తే చూసిన కథలనే మళ్లీ చూడాల్సి వస్తుంది: నాని

తానెప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించనని హీరో నాని అన్నారు. వసూళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే ఒకానొక సమయంలో చూసిన కథలనే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Published : 09 Nov 2023 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వసూళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే ఒకానొక సమయంలో చూసిన కథలనే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుందని హీరో నాని (nani) అన్నారు. తానెప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘దసరా’, ‘జెర్సీ’ నా కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌ అని ఎవరైనా అన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో సెక్షన్‌ ఆడియన్స్‌ ఉంటారు. కలెక్షన్స్‌ మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలంటే చూసిన కథలనే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుంది. ఎప్పుడూలేనంతగా ఈసారి తెలుగు సినిమాలకు అధిక సంఖ్యలో జాతీయ అవార్డులు వచ్చాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళ చిత్రం ‘జై భీమ్’ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కించుకోకపోవడంతో బాధపడ్డా. అందుకే సోషల్‌ మీడియాలో హార్ట్‌ బ్రేక్‌ ఎమోజీ పోస్ట్‌ చేశా. కానీ, దాన్ని మరోలా అర్థం చేసుకున్న కొన్ని వెబ్‌సైట్స్‌ వారు తప్పుగా వార్తలు రాశారు. నెపోటిజం (బంధుప్రీతి) గురించి చిత్ర పరిశ్రమ వారి విషయంలోనే ఎందుకు మాట్లాడతారో నాకు అర్థంకాదు. తండ్రి వృత్తిని చూస్తూ పెరిగిన కొడుకు అదే రంగంలోకి వెళ్లాలనుకుంటాడు కదా’’ అని అన్నారు.

చిరంజీవితో సినిమా.. లారెన్స్‌ మాస్టర్‌ ఏమన్నారంటే?

కథల ఎంపికపై స్పందిస్తూ.. ‘‘ప్రేక్షకులకు మంచి కథలను చెప్పాలనుకుంటానేగానీ ఇమేజ్‌ గురించి ఎప్పుడూ ఆలోచించను. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించాలనుకుంటా’’ అని నాని తెలిపారు. ‘దసరా’తో ఘన విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’తో బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ సందడి చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని