Nani: నాకూ ఓ కూతురు ఉంటే బాగుండనిపిస్తోంది: నాని

నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ‘హాయ్‌ నాన్న’ సినిమా డిసెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారం జోరును పెంచారు.

Published : 09 Nov 2023 13:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు కూడా ఓ కూతురు ఉంటే బాగుండనిపిస్తోందని హీరో నాని అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘హాయ్‌ నాన్న’లో నటిస్తున్నప్పటి నుంచి కూతురు కావాలనిపిస్తోందన్నారు. ‘‘ఇంతకు ముందు కూడా తండ్రి పాత్రల్లో నటించాను కానీ.. ‘హాయ్ నాన్న’లో ఓ అమ్మాయికి తండ్రిగా నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నాకు మొదటి నుంచీ ఆడపిల్లలంటే ఇష్టం. ఈ సినిమాలో నటించడం మొదలు పెట్టాక కూతురుతో ఎలా ఉండాలో అనుభవం వచ్చింది. అందుకే నాకూ ఓ కూతురుంటే బాగుండనిపిస్తోంది’’ అని చెప్పారు.

మన సినిమాలు హాలీవుడ్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమాలకు గుర్తింపు పెరిగింది. ఓవర్సీస్‌లోనూ వేల థియేటర్లలో మన సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో.. విదేశాల్లోనూ మన సినిమాలు చూసి అలానే ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లతో రాజమౌళి భారతీయ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు.

ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి.. ఎంతో బాధపడ్డా: సమంత

ఇక ‘హాయ్‌ నాన్న’ విషయానికొస్తే.. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్య అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. తండ్రీ కూతుళ్ల బంధం, ప్రేమ ప్రధానంగా సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడదులైన ఇందులోని ‘అమ్మాడి’ పాట ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిసెంబరు 7న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని