Samantha: ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి.. ఎంతో బాధపడ్డా: సమంత

నటి సమంత (Samantha) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న  బాధల గురించి చెప్పారు. ఒకేసారి మూడు రకాల సమస్యలు తనని చుట్టుముట్టినట్లు తెలిపారు.

Published : 09 Nov 2023 11:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి.. పూర్తి సమయాన్ని ఆరోగ్య సంరక్షణకు కేటాయించారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో తాను ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు.

‘‘ఒకవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ లభించలేదు. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది’’ అని తెలిపారు.

అలాంటి సినిమాల్లోనే భాగంకావాలనుకున్నా..: మృణాల్‌ ఠాకూర్‌

ఇక ఇంతమందిలో గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని సమంత అన్నారు. ‘‘ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అందమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’’ అని సమంత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని