Nani: టాలీవుడ్‌లో అలా చేయడం ఇదే తొలిసారేమో: నాని

‘హాయ్‌ నాన్న’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ హైదరాబాద్‌లో జరిగాయి. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది.

Published : 17 Dec 2023 23:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని (Nani) హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్‌ ఠాకూర్‌ ( Mrunal Thakur) కథానాయిక. బేబీ కియారా కీలక పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

మహేశ్‌బాబుతో సితార సెల్ఫీ.. చీరలో కాజల్‌ సింప్లిసిటీ!

వేడుకనుద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘‘నటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషితోనే ఏ సినిమా అయినా రూపొందుతుంది. అయితే, కొన్నిసార్లు పలు చిత్రాల విషయంలో మ్యాజిక్‌ జరుగుతుంది. హాయ్‌ నాన్న చిత్రం విషయంలో ఆ మ్యాజిక్‌ బేబీ కియారా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ సినిమాని ప్రేమించడం వల్లే మీరంతా (ప్రేక్షకులు) ఫీలయ్యారు. మ్యూజిక్‌ విషయంలో హేషమ్‌ ప్రాణం పెట్టాడు. ఈ ఏడాదిలో రెండు విజయాలను (దసరా, హాయ్‌ నాన్న) అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2023 నాకెంతో ప్రత్యేకం. బాక్సాఫీసు లెక్కలు, స్థాయి, స్థానాలు అనే వాటిని నేను పట్టించుకోను. ఈ సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ మా టీమ్‌ తరఫున కృతజ్ఞతలు’’ అని అన్నారు. కీలక పాత్ర పోషించిన రితికా నాయక్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. ‘నా వయసున్న హీరోకి నీ వయసున్న అమ్మాయి కుమార్తెగా నటించడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’ అని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో దర్శి, రితికా నాయక్‌, బేబీ కియారా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని