Nani: సినిమా నాకు ఆక్సిజన్‌లాంటిది.. ఫలితాలు పట్టించుకోను: నాని

హీరో నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేదికపై నాని మాట్లాడారు.

Published : 24 Nov 2023 20:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు సినిమా ఆక్సిజన్‌లాంటిదని నటుడు నాని (Nani) అన్నారు. ఫలితాలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తానని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. ఆయన హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. శ్రుతి హాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ సంగతి తలుచుకుని ఏడ్చేశా.. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా: విజయ్‌ వర్మ

వేడుకనుద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘‘హాయ్‌ నాన్న’లో నా లుక్‌ బాగుంటుంది. నాకు నేనే బాగా నచ్చా. ఇన్నేళ్లలో ఏ సినిమాకూ ఇలా అనిపించలేదు. పాటలు, టీజర్‌, ట్రైలర్లలో లేనిది, మీరు ఊహించనిది సినిమాలో చాలా ఉంది. సినిమా నాకు ఆక్సిజన్‌తో సమానం. ఊపిరిపై ఒట్టేసి చెబుతున్నా.. ఈ చిత్రంతో మీరంతా ప్రేమలో పడతారు’’ అని ధీమా వ్యక్తం చేశారు. చిత్రీకరణలో భాగంగా కంటికి గాయమైందని, అందుకే కళ్లజోడు పెట్టుకున్నానని తెలిపారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

* ట్రైలర్‌ చూస్తే ‘జెర్సీ’ సినిమా ఎమోషన్‌ కనిపిస్తోంది. రెండింటికీ తేడా ఏంటి?

నాని: ‘జెర్సీ’లో కొడుకు. ‘హాయ్‌ నాన్న’లో కూతురు. కొడుకు ఎమోషన్‌కు, కూతురు ఎమోషన్‌కు ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా! ‘జెర్సీ’ ఎలా మీ హృదయాలను హత్తుకుందో ‘హాయ్‌ నాన్న’ కూడా అలానే హత్తుకుంటుంది.

* ఈ సినిమా విషయంలో, మీ కొడుకు విషయంలో బెస్ట్‌ మూమెంట్‌?

నాని: ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. సినిమాపై నమ్మకంగా ఉన్నాం. డిసెంబరు 7 ఉదయమే నాకు బెస్ట్‌ మూమెంట్‌ కానుంది. నా కొడుకు విషయానికొస్తే.. ‘నీ అభిమాన హీరో ఎవరు?’ అని అడిగితే నువ్వే నాన్న అని సమాధానమిచ్చాడు. రియల్‌ లైఫ్‌లో అదే బెస్ట్‌ మూమెంట్‌.

* మీరు ఈ కథను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?

నాని: మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో కథను ఓకే చేశా.

* ‘అంటే.. సుందరానికీ!’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ‘హాయ్‌ నాన్న’ విషయంలో ఏమైనా సందేహించారా?

నాని: ఫలితాలతో నాకు సంబంధంలేదు. నాకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోతా. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు