Hi nanna: సినిమా చూసిన వారందరికీ అదే భావన కలుగుతుంది.. ‘హాయ్‌ నాన్న’పై నాని సతీమణి పోస్ట్‌

నాని-మృణాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంపై నాని భార్య అంజన పోస్ట్‌ పెట్టారు.

Published : 07 Dec 2023 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్‌ నాన్న’(hi nanna). నేడు (డిసెంబర్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. పాటలతోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా.. విడుదలయ్యాక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా దీనిపై నాని భార్య అంజన పోస్ట్‌ పెట్టారు. నాని(Nani) తన కుమారుడితో కలిసి సినిమా చూస్తోన్న ఫొటో షేర్‌ చేసిన ఆమె.. ‘ఈ సినిమా చూసిన అందరికీ.. వాళ్లకు ఇష్టమైన వారిని హత్తుకోవాలనిపిస్తుంది. నాన్న పాత్రలో నాని ఒదిగిపోయారు. సినిమా చూస్తున్నంతసేపు నాకు మా నాన్న గుర్తుకువచ్చారు’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌ చూసిన వారు కూడా ‘క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంది’ అంటూ వాళ్ల అభిప్రాయాన్ని కామెంట్స్‌ చేస్తున్నారు.

సిద్ధార్థ్‌ ప్రపోజల్‌.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోను: కియారా అడ్వాణీ

అలాగే ఈ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు పెట్టిన రివ్యూలకు నటి మృణాల్‌ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సీతారామం’ తర్వాత మీరు మరో తెలుగు సినిమా చేయడానికి ఎందుకు ఇంత విరామం తీసుకున్నారా అని అనుకున్నాను. దానికి ‘హాయ్‌ నాన్న’తో సమాధానం చెప్పారు. ‘సీతారామం’లో సీత.. మళ్లీ ‘హాయ్‌నాన్న’లో య‌ష్నగా తిరిగొచ్చింది’ అని ఓ అభిమాని పెట్టిన పోస్ట్‌కు మృణాల్ స్పందిస్తూ ‘ఇలాంటి మంచి పాత్ర కోసం చూసే ఎదురుచూపులు ఎప్పటికైనా విలువైనవే’ అని పేర్కొన్నారు. అలాగే సినిమా గురించి మృణాల్‌ మాట్లాడుతూ.. ఇది తనకెంతో ప్రత్యేకమైందన్నారు. తన జీవితంలో గుర్తుండిపోయే మంచి సినిమాలో అవకాశమిచ్చినందుకు ‘హాయ్‌ నాన్న’ చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని