Nayanthara: పెళ్లిరోజు వేడుకల్లో నయన్‌-విఘ్నేశ్‌.. క్యూట్‌ అంటూ కామెంట్స్‌

నయన-విఘ్నేశ్‌లు వారి రెండో పెళ్లి రోజును విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

Published : 11 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌ అనగానే నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan)ల జోడి గుర్తొస్తుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీళ్లిద్దరూ తాజాగా పెట్టిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జూన్‌ 9న వీళ్ల రెండో వివాహ వార్షికోత్సవాన్ని విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం సమ్మర్‌ వెకేషన్ కోసం ఫారెన్‌ వెళ్లిన వీళ్లిద్దరూ.. పెళ్లి రోజు వేడుకలను అక్కడే చేసుకున్నారు. ఈసందర్భంగా నయనతారపై (Nayanthara) తనకున్న ప్రేమను తెలుపుతూ విఘ్నేశ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు.

 అమెరికాలో సందడి చేసిన విజయ్‌ దేవరకొండ.. వీడియోలు వైరల్‌

‘నయనతార ప్రేమకు పదేళ్లు. విక్కీ - నయన్‌కు రెండేళ్లు. నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఉయ్యుర్‌, ఉలగంలకు తండ్రి కావడం నా జీవితంలో జరిగిన గొప్ప విషయాలు. నీతో మరెన్నో మధుర క్షణాలను గడపాలని కోరుకుంటున్నా. ఎన్నో ఒడుదొడుకులు, మరెన్నో ట్రోల్స్‌, ప్రశంసలు, జయాపజయాలను చూశాం. ఎప్పుడూ ఒకరికొకరం అండగా ఉన్నాం. దేవుడు మనకు ఎప్పుడూ తోడుండాలని.. పెద్ద విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు. దీనిపై నయనతార స్పందిస్తూ.. ‘యూ ఆర్‌ ది బెస్ట్‌.. లవ్‌ యూ’ అని రాశారు. ఈసందర్భంగా పిల్లలతో ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు నయన్‌-విఘ్నేశ్‌లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. క్యూట్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని