Vijay Deverakonda: అమెరికాలో సందడి చేసిన విజయ్‌ దేవరకొండ.. వీడియోలు వైరల్‌

విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. అక్కడ ఓ కార్యక్రమంలో సందడి చేశారు.

Updated : 10 Jun 2024 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. ఈ యంగ్‌ హీరోకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులున్న సంగతి తెలిసిందే. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్‌ (Vijay Deverakonda)ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘అమెరికా (USA)లో విజయ్‌ క్రేజ్‌’ అంటూ నెటిజన్లు వాటిని షేర్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్’తో పలకరించిన ఆయన త్వరలోనే మూడు సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్‌ (Vijay Deverakonda) గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రాహుల్ సంకృత్యాన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. 1854 నుంచి 1873 మధ్య సాగిన కథగా ఇది రానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని