Nayanthara: నయనతారకు విఘ్నేశ్‌ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?

తన సతీమణి నయనతారకు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఖరీదైన బహుమతి ఇచ్చారు. అదేంటంటే?

Published : 01 Dec 2023 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోయిన్‌, తన భార్య నయనతార (Nayanthara)కు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చారు. ఆమె పుట్టినరోజు కానుకగా మెర్సిడెస్‌ బెంజ్‌ మేబ్యాక్‌ కారును అందించారు. భర్త సర్‌ప్రైజ్‌కు నయనతార ఫిదా అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కారును చూపించకుండా కేవలం లోగో ఫొటో మాత్రమే షేర్‌ చేశారు. ఆ కారు విలువ రూ. 3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. నయనతార పుట్టినరోజు నవంబరు 18కాగా విఘ్నేశ్‌ తాజాగా బహుమతి ఇచ్చారు.

సైలెంట్‌గా.. కిరాక్‌ ఆర్పీ వివాహం

సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘జవాన్‌’తో అలరించారు నయనతార. ఆమె నటించిన 75వ సినిమా ‘అన్నపూరణి’ (Annapoorani). నీలేశ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. జై, సత్యరాజ్‌, కార్తీక్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి... ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుందో ఈ సినిమాలో చూపించనున్నారు. మరోవైపు, ‘టెస్ట్‌’లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘కాతువాకుల రెండు కాదల్‌’తో గతేడాది విజయాన్ని అందుకున్న విఘ్నేశ్‌ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని