Nayanthara: నన్ను అలా పిలిస్తే తిట్టినట్లు ఉంటుంది..: నయనతార

తనను లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలవడం నచ్చదని నయనతార ( Nayanthara) అన్నారు. అలా పిలిస్తే తిట్టినట్లు అనిపిస్తుందన్నారు.

Updated : 09 Dec 2023 11:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జవాన్‌’లో తన యాక్షన్‌తో అదరగొట్టారు నయనతార (Nayanthara). తాజాగా ‘అన్నపూరణి’ (Annapoorani) తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తనని సూపర్‌ స్టార్‌ అని పిలవడంపై ఆమె సరదాగా స్పందించారు.

ఎన్నో చిత్రాలతో అలరిస్తున్న నయనతారకు అభిమానులు లేడీ సూపర్‌ స్టార్‌ అని బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి ఆమె మాట్లాడుతూ..‘‘నన్ను లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలవడం నాకు నచ్చదు. ఎవరైనా అలా పిలిస్తే నన్ను తిట్టినట్లు అనిపిస్తుంది. ‘జవాన్‌’ సినిమా తర్వాత చాలా మంది ఇదే పేరుతో పిలుస్తున్నారు. అదంతా వారి అభిమానం. ఈ రోజు నేను ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే అది ఇండస్ట్రీ వల్ల నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఇంత కీర్తిని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి’’ అని చెప్పారు. ‘జవాన్‌’ సినిమా ప్రజల హృదయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకుందన్నారు.

అలా చేసి ఉంటే.. ‘భగవంత్‌ కేసరి’ దెబ్బతినేది: పరుచూరి గోపాలకృష్ణ

ఇక ‘అన్నపూరణి’ సినిమా విషయానికొస్తే.. నయనతార 75వ చిత్రంగా ఇది రూపొందింది. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఉపశీర్షిక. నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. మాంసాహార వంటలకు సంబంధించిన రెస్టారెంట్‌ పెట్టుకోవాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కథతో ఇది తెరకెక్కింది. అలాగే ప్రస్తుతం ఆమె ‘టెస్ట్‌’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని