Nayanthara: ఆయన మహిళలకు ఎంతో గౌరవమిస్తాడు.. స్టార్‌ హీరోపై నయన్‌ ప్రశంసలు

తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి తాజాగా ఓ మ్యాగజైన్‌ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు నటి నయనతార. ఇందులో ఆమె తన బాలీవుడ్‌ ఎంట్రీ గురించి స్పందించారు.

Published : 07 Apr 2024 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జవాన్‌’(Jawan)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి నయనతార (Nayanthara). కెరీర్‌ మొదలైన 20 ఏళ్ల తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంపై తాజాగా స్పందించారు. సరైన ఆఫర్‌ కోసం తాను ఎంతోకాలం ఎదురుచూశానని తెలిపారు.

‘‘బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎంతోకాలం ఎదురుచూశా. దర్శకుడు అట్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. ‘జవాన్‌’ కథతో అతడు నా వద్దకు వచ్చినప్పుడు కమర్షియల్‌ స్టోరీ, స్టార్‌ హీరో చిత్రంతో లాంచ్‌ కావడం కరెక్ట్‌ అనిపించింది. సవాలు విసిరే పాత్ర పోషించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. షారుక్‌కు అభిమాని కాకుండా ఎవరైనా ఉంటారు? ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగా. అగ్ర కథానాయకుడు అయినప్పటికీ సెట్‌లో ఉన్న మహిళలకు ఆయన ఎంతో గౌరవం ఇస్తారు’’ అని నయనతార చెప్పారు. కెరీర్‌ రాణించేందుకు విఘ్నేశ్‌ తనకెంతో సపోర్ట్‌ చేశాడని ఆమె అన్నారు. తమని కలిపింది ధనుష్‌ అని విఘ్నేశ్‌ పేర్కొన్నారు.

ఓటు విలువ తెలియజేస్తూ అన్ని రకాల కమర్షియల్‌ హంగులతో ‘జవాన్‌’ రూపుదిద్దుకుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్‌ ద్విపాత్రాభినయం పోషించారు. నర్మదా రాయ్‌గా నయన్‌ కనిపించారు. గతేడాది విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని