Tollywood: విడుదల జాతర
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15కిపైగా చిత్రాలు ‘విడుదల’ అంటూ పోస్టర్‌ని ప్రకటించేశాయి.
ఈ శుక్రవారం థియేటర్లలో 15కిపైగా చిత్రాలు
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15కిపైగా చిత్రాలు ‘విడుదల’ అంటూ పోస్టర్‌ని ప్రకటించేశాయి. ఇందులో దాదాపు పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాలే. ఈ నెల చివరి వారాల నుంచే ప్రముఖ హీరోల సినిమాలు వరుస కడుతుండడం... జనవరి పోటీలో ఎలాగో విడుదల చేసుకొనే పరిస్థితులు లేకపోవడంతో ఇదే సరైన సమయంగా భావించారు పలువురు దర్శకనిర్మాతలు. ఎవరి పరిధిలో వాళ్లు చేసినంత ప్రచారం చేసి సినిమాల్ని బాక్సాఫీసు ముందుకు తీసుకొస్తున్నారు.
ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవుతన్నాయంటే చాలు... బాక్సాఫీసు దగ్గర ప్రత్యేకమైన కోలాహలం కనిపిస్తుంది. పండగల సమయంలోనూ... ఇతర ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అంతకుమించి అంటే సాధ్యమయ్యే పని కాదు. థియేటర్ల సమస్య ఉత్పన్నం అవుతుంది. వసూళ్లు తగ్గిపోతాయి. సంక్రాంతికి మూడు సినిమాలు విడులదవుతుంటేనే... ఎవరికి ఏవి? ఎన్ని? అంటూ థియేటర్ల గురించి బోలెడన్ని లెక్కలు, గొడవలు. అయితే ఈ లెక్కలన్నీ అగ్ర తారల సినిమాలకి సంబంధించే! పరిమిత వ్యయంతో రూపొందే సినిమాలకి మాత్రం విడుదల కావడం ఒక్కటే లెక్క. బాక్సాఫీసు దగ్గర ఎప్పుడు ఖాళీ దొరికిందంటే అప్పుడు బొమ్మ వేసేయడమే లక్ష్యం అన్నట్టుగా ఎదురు చూస్తుంటారు కొందరు దర్శకనిర్మాతలు. కారణాలేవైనా... అనువాద చిత్రాలతో కలిపి ఈ వారం 15కిపైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో తమన్నా, సత్యదేవ్ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’, బ్రహ్మానందం, స్వాతి తదితరులు నటించిన ‘పంచతంత్రం’, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘డేంజరస్’తోపాటు ‘చెప్పాలని ఉంది’, ‘ముఖచిత్రం’ ప్రధానంగా కనిపిస్తున్నాయి.
* కిందటి వారాల్లో వచ్చిన కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ‘యశోద’, ‘మసూద’, ‘లవ్ టుడే’, ‘మట్టి కుస్తీ’, ‘హిట్ 2’ తదితర చిత్రాలకి, వచ్చే శుక్రవారం విడుదల కానున్న పదుల సంఖ్యలో చిత్రాలు తోడు కానున్నాయి. అనువాద చిత్రాలు ‘ఆక్రోశం’, ‘విజయానంద్’, ‘సివిల్ ఇంజినీర్’తోపాటు, ‘లెహరాయి’, ‘ప్రేమదేశం’, ‘రాజయోగం’, ‘ఏయ్ బుజ్జీ నీకు నేనే’, ‘మనం అందరం ఒక్కటే’, ‘లవ్ యు ఇడియట్’, ‘ఎట్ లవ్’, ‘ఏపీ 04 రామాపురం’ తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే వీటిలో చూడాలనే ఆసక్తిని పెంచిన సినిమాలు కొన్నే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సోలోగా సదా.. క్యూట్‌గా ఐశ్వర్య.. గులాబీలతో నభా!
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
-
India News
Rahul Gandhi: ‘ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం
-
Sports News
IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం