Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కో- సీఈవో ముచ్చట.. ఫొటోలు వైరల్‌

నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో హైదరాబాద్‌లోని హీరో రామ్‌ చరణ్‌ ఇంటికి వచ్చారు. సరదాగా ముచ్చటించారు.

Updated : 07 Dec 2023 21:00 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో (Netflix Co- CEO) టెడ్‌ సరాండొస్‌ (Ted Sarandos) గురువారం హైదరాబాద్‌ వచ్చారు. నేరుగా హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) నివాసానికి ఆయన చేరుకోగా చరణ్‌తోపాటు ఆయన తండ్రి, అగ్ర నటుడు చిరంజీవి (Chiranjeevi), హీరోలు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) స్వాగతం పలికారు. నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు కూడా అక్కడ ఉన్నారు. వీరందరితో టెడ్‌ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం సెల్ఫీలు తీసుకున్నారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట్లోకిరాగా అవి వైరల్‌ అయ్యాయి. టెడ్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిథులు చరణ్‌ ఇంటికి వెళ్లారు.

సినిమా చూసిన వారందరికీ అదే భావన కలుగుతుంది.. ‘హాయ్‌ నాన్న’పై నాని సతీమణి పోస్ట్‌

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు... ఈ బృందం చరణ్‌ ఇంటిని క్యాజువల్‌గా సందర్శించిందా? ఏదైనా ప్రాజెక్టు కోసం మాట్లాడేందుకు వెళ్లిందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించి, తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని