వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్‌ ప్రముఖులపై నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో పోస్టు

మూడు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో టెడ్ సరాండొస్‌ (Ted Sarandos) టాలీవుడ్‌ ప్రముఖులను కలిశారు. ఆ ఫొటోలను ఆయన షేర్ చేశారు.

Updated : 09 Dec 2023 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో (Netflix Co- CEO) టెడ్‌ సరాండొస్‌ (Ted Sarandos) హైదరాబాద్‌లో పర్యటించారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి టాలీవుడ్‌ ప్రముఖులతో చర్చించారు.

‘ఎంతో దూరదృష్టి కలిగిన టెడ్‌ సరాండొస్‌, ఆయన బృందంతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఎన్నో భవిష్యత్తు ప్రణాళికలను చర్చించాం’ అని మహేశ్‌ (Mahesh babu) తెలిపారు. ఇక ఈ ఫొటోల్లో దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా ఉన్నారు.

నన్ను అలా పిలిస్తే తిట్టినట్లు ఉంటుంది..: నయనతార

మరోవైపు హైదరాబాద్‌ పర్యటనపై టెడ్‌ సరాండొస్‌ కూడా పోస్ట్‌ పెట్టారు. అల్లు అర్జున్‌ (Allu arjun), సుకుమార్‌, రాజమౌళి (Rajamouli), వెంకటేశ్‌, నాగచైతన్య, రానాలను కలిసిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘‘తెలుగు సినిమా లెజెండ్స్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలపై వారికి ఉన్న అంకితభావానికి నేను ఆశ్చర్యపోయాను. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించారు. త్వరలోనే మళ్లీ కలుస్తాను’’అని పోస్ట్‌ చేశారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో టాలీవుడ్‌ ప్రముఖులందరినీ కలవడంపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  వీళ్లందరితో నెట్‌ఫ్లిక్స్‌  భారీ ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం చేస్తోందా..? అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని