Nikhil: షూటింగ్‌ పూర్తవ్వకుండానే రిలీజ్‌ చేశారు..ఫ్లాప్‌ సినిమాపై నిఖిల్‌ కామెంట్స్‌

యంగ్‌ హీరో నిఖిల్ (Nikhil) తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో మాట్లాడుతూ తన చిత్రాల గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

Published : 26 Oct 2023 17:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తాను నటించిన ఓ సినిమాను షూటింగ్‌ పూర్తవ్వకుండానే రిలీజ్‌ చేశారని అందుకే ఫ్లాప్ అయిందని హీరో నిఖిల్ (Nikhil)అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గతంలో తన సినిమాల్లో జరిగిన తప్పులు రానున్న వాటిల్లో జరగకుండా చూసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘స్పై’ చిత్రం గురించి మాట్లాడారు.

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ అదృశ్యం వెనుక ర‌హ‌స్యాన్ని స్పృశిస్తూ.. ఓ గూఢ‌చారి క‌థ‌తో ‘స్పై’ రూపొందింది. అయితే, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం నిరాశను మిగిల్చింది. తాజాగా దీని గురించి నిఖిల్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘స్పై’ (SPY)  సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయి. పది రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసేసి విడుదల చేశారు. అందుకే అది ప్రేక్షకాదరణ పొందలేదని నా అభిప్రాయం. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులను నిరాశపరచినందుకు నేను క్షమాపణలు కూడా చెప్పా. రానున్న సినిమాల్లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా. ‘కార్తికేయ-3’, ‘స్వయంభూ’,  ‘ది ఇండియా హౌస్‌’ చిత్రాల క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడను. నా అభిమానులకు మంచి సినిమాలను అందిస్తాను’’ అని తన అభిమానులకు నిఖిల్ మాటిచ్చారు.

ఇంటిమేట్ సీన్‌.. జయప్రద చెంపదెబ్బ కొట్టారంటూ వార్తలు: తొలిసారి స్పందించిన నటుడు

ఇక ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ పనుల్లో బిజీగా ఉన్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం నిఖిల్‌ 3 నెలల పాటు వియత్నాంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని