ఇంటిమేట్ సీన్‌.. జయప్రద చెంపదెబ్బ కొట్టారంటూ వార్తలు: తొలిసారి స్పందించిన నటుడు

బాలీవుడ్‌ నటుడు దాలిప్‌ తాహిల్‌ (Dalip Tahil) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌కు సంబంధించి వచ్చిన పలు వార్తలపై ఆయన స్పందించారు. 

Published : 26 Oct 2023 13:26 IST

ముంబయి: బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి అక్కడివారికి చేరువయ్యారు సీనియర్‌ నటుడు దాలిప్‌ తాహిల్‌. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతంలో తన గురించి వచ్చిన వార్తలపై స్పందించారు. జయప్రద తనని చెంపదెబ్బ కొట్టారంటూ జరిగిన ప్రచారంపై ఆయన తొలిసారి మాట్లాడారు.

‘‘జయప్రద అంటే నాకెంతో గౌరవం. ఆమె అందమైన నటి. ఓ సినిమా సెట్‌లో ఆమె నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వచ్చిన వార్తలు చూసి నేను ఆశ్చర్యపోయా. ఇంతకీ ఆ సంఘటన ఏ సినిమా సెట్‌లో చోటుచేసుకుందో చెబితే తెలుసుకుంటా. ఎందుకంటే నేను ఇప్పటి వరకూ ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. కెరీర్‌ ఆరంభం నుంచి నేను ప్రతినాయకుడి పాత్రల్లోనే ఎక్కువగా నటించా. అందువల్ల అత్యాచారం సన్నివేశాలు నాతో చిత్రీకరించేవారు. అలాంటి సీన్‌ ఏదైనా ఉంటే.. నాతోపాటు హీరోయిన్‌కి కూడా ముందే చెప్పమనేవాడిని. వాళ్లు ఓకే అంటేనే ఆ సీన్‌లో నటిస్తానని.. లేకపోతే చేయనని చెప్పేసేవాడిని. ఒకవేళ దర్శకుడు బలవంతం చేస్తే సెట్‌ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడిని’’ అని ఆయన చెప్పారు.

వైరలవుతోన్న దీపికా-రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి వీడియో.. భావోద్వేగానికి గురైన కరణ్‌ జోహార్‌

1974లో విడుదలైన ‘అంకుర్‌’తో దాహిల్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘శక్తి’, ‘గాంధీ’, ‘జల్వా’, ‘బాజీఘర్‌’, ‘ఇష్క్‌’, ‘రేస్‌’, ‘హలో’, ‘ప్రిన్స్‌’, ‘దర్బార్‌’, ‘హిట్‌ : ది ఫస్ట్ కేస్‌’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని