Spy: వినోదం.. దేశభక్తి సినిమా ఇది

నిఖిల్‌ హీరోగా గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’. కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 01 Jul 2023 07:31 IST

నిఖిల్‌ (Nikhil) హీరోగా గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy). కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శుక్రవారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. నా కెరీర్‌లోనే అత్యధిక ప్రారంభ వసూళ్లు వచ్చాయి. నా కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కిస్తూ ఈ స్థాయి వసూళ్లు ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇకపై మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని మాటిస్తున్నా. ఇది చాలా రిచ్‌ ఫిల్మ్‌. వినోదం, దేశభక్తి అన్నీ ఉన్నాయి. మంచి సినిమా చూశామనే అనుభూతి అందిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. తెలుగులో చేసిన తొలి చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం ఆనందాన్నిస్తోంది’’ అంది నాయిక ఐశ్వర్య. ఈ కార్యక్రమంలో గ్యారీ బీహెచ్‌, చరణ్‌ తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని