Nithiin: పవన్‌ కల్యాణ్‌ గురించి ఎప్పుడూ ఒకే మాట చెబుతాను: నితిన్‌

తన సినిమాలో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇమేజ్‌ను చూపించడం గురించి నితిన్ మాట్లాడారు. తాను ఎప్పటికీ పవన్‌కు అభిమానినేనని అన్నారు.

Published : 27 Nov 2023 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: స్టార్ హీరో పవన్‌ కల్యాణ్‌కు కోట్లలో అభిమానులుంటారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలకు కూడా ఆయనంటే ఇష్టం. వాళ్లలో నితిన్‌ (Nithiin) ఒకరు. తాను పవన్‌కు వీరాభిమానినని నితిన్‌ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. అలాగే తన సినిమాల్లో పవన్‌ మేనరిజాన్ని, ఆయన డ్రెస్‌లను.. ఇలా ఏదోఒకటి ఉండేలా చూసుకుంటారు. తాజాగా తన కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్‌ దీనిపై స్పందించారు.

‘నా సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని (Pawan Kalyan) ఎక్కువగా చూపిస్తున్నానంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ, నాకంటే ఎక్కువ మంది హీరోలు వాళ్ల సినిమాల్లో పవన్‌ ఇమేజ్‌ను చూపించారు. ఇక ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’లో ఒక సీన్‌లో భాగంగా పవన్‌లా డ్రెస్‌ వేసుకున్నా.. అంతేగానీ  ఫొటోషూట్‌ కోసం అలా రెడీ కాలేదు. నేను హీరోనైనా ఆయనకు మాత్రం అభిమానినే. ఇదే మాట ఎప్పుడూ చెబుతాను. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను. మొదటి నుంచి పవన్‌కు అభిమానిననే చెబుతాను’ అని నితిన్‌ అన్నారు.

ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం.. లేటెస్ట్‌ సినిమాపై సమంత రివ్యూ

ఇక ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’ (Extra Ordinary Man) విషయానికొస్తే.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దీని షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300మందికి పైగా విదేశీడ్యాన్సర్లతో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. డిసెంబరు 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని