Samantha: ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం.. లేటెస్ట్‌ సినిమాపై సమంత రివ్యూ

ఇటీవల విడుదలైన ‘కాథల్-ది కోర్‌’ ఎంతో అద్భుతంగా ఉందంటూ సమంత పోస్ట్‌ పెట్టారు. మమ్ముట్టి తన హీరో అని పేర్కొన్నారు.

Updated : 27 Nov 2023 11:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు.. తాను చూసిన చిత్రాల రివ్యూలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘కాథల్-ది కోర్‌’ (Kaathal - The Core)పై ఆమె స్పందించారు.

‘‘కాథల్-ది కోర్‌’’ అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం. అందరూ చూడాల్సిన శక్తిమంతమైన సినిమా. మమ్ముట్టి నా హీరో. ఇందులో మీ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫీల్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లవ్యూ జ్యోతిక’’ అని పోస్ట్‌ చేశారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు జీయోబాబీని లెజెండ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సమంత పోస్ట్‌పై ‘కాథల్-ది కోర్‌’ నిర్మాణ సంస్థ స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది.

డిసెంబరు ఫస్ట్‌ వీక్‌.. అటు థియేటర్‌, ఇటు ఓటీటీ వేరే లెవల్‌!

ఇక నవంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. విడుదలకు ముందు నుంచే ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ఇందులో చూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని