NTR: వార్‌ కోసం ముంబయికి

స్టైల్‌ మార్చి రంగంలోకి దిగారు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌తో కలిసి వార్‌ షురూ చేస్తున్నారు.

Updated : 12 Apr 2024 12:31 IST

స్టైల్‌ మార్చి రంగంలోకి దిగారు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌తో కలిసి వార్‌ షురూ చేస్తున్నారు. గురువారమే ‘వార్‌ 2’ కోసం ముంబయిలో అడుగు పెట్టారు ఎన్టీఆర్‌. ప్రఖ్యాత యశ్‌రాజ్‌ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఆరో చిత్రమే ‘వార్‌ 2’. హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలో కొన్ని రోజులపాటు ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు ఎన్టీఆర్‌. అందుకోసం గురువారం హైదరాబాద్‌ నుంచి ముంబయికి బయల్దేరి వెళ్లారు. పాత్రకు తగ్గట్టుగా తన లుక్‌ని మార్చుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్రబృందం ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని