NTR: గోవా తీరానికి దేవర

‘దేవర’గా థియేటర్లలో సందడి చేసేందుకు సమాయత్తమవుతున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.

Published : 10 Jun 2024 01:55 IST

‘దేవర’గా థియేటర్లలో సందడి చేసేందుకు సమాయత్తమవుతున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం తాజాగా గోవాలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ఇందులో భాగంగా తారక్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. వచ్చే వారాంతానికి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో తారక్‌ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్‌:1’ పేరుతో అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని