NTR: నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవోకు ఎన్టీఆర్‌ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్‌

నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో టెడ్‌కు నటుడు ఎన్టీఆర్‌ (NTR) ఆతిథ్యమిచ్చారు. టెడ్‌, ఆయన బృందానికి శుక్రవారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు.

Updated : 09 Dec 2023 00:00 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో టెడ్‌ సరాండొస్‌ (Ted Sarandos) ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం రామ్‌చరణ్‌ నివాసంలో సందడి చేసిన ఆయన.. తాజాగా ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం టెడ్‌, ఆయన బృందానికి ఎన్టీఆర్‌ తన ఇంట ఆతిథ్యమిచ్చారు. భోజనం అనంతరం కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తారక్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి

‘‘మీకూ, మీ బృందానికి విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా, ఫుడ్‌కు సంబంధించిన విషయాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా అనిపించింది’’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఈ విందులో కొరటాల శివ, కల్యాణ్‌రామ్‌ సైతం పాల్గొన్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు.. ‘ఏదైనా ఆసక్తికర వార్త చెప్పనున్నారా?’, ‘రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌తో ఏదైనా ప్రాజెక్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

రామ్‌ చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించి, తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని