Devara: గోవా వెళ్తోన్న ఎన్టీఆర్‌.. ‘దేవర’ యాక్షన్‌ సీన్స్‌ షురూ..

కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ప్రస్తుతం దీని షూటింగ్ గోవాలో జరుగుతోంది.

Published : 27 Oct 2023 18:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (NTR) ప్రస్తుతం ‘దేవర’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం గోవాలో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందమంతా అక్కడకు చేరుకుంది. శుక్రవారం ఎన్టీఆర్‌ కూడా గోవా బయల్దేరారు. ఆయన విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో తారక్‌ న్యూలుక్‌ బాగుందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఈ షెడ్యూల్‌లోనే జాన్వీ కపూర్‌పై మరిన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గోవాలో షూట్‌ పూర్తి కాగానే మూవీ యూనిట్‌ గోకర్ణం షిప్ట్‌ కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ భారీ సెట్‌ వేసి కొన్ని సన్నివేశాలు తీయనున్నారట. ఇక చిత్రబృందం ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లతో ‘దేవర’ (Devara)పై అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వెలువడుతోన్న వార్తలు ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాల కోసం కొరటాల శివ హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దీంట్లో తారక్‌ అండర్ వాటర్‌ ఫైటింగ్‌ సీన్‌ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీని కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నారట. ముంబయి నుంచి తీసుకొచ్చిన ట్రైనర్స్‌తో తారక్‌కు శిక్షణ ఇప్పించారట.

50 రోజులు పూర్తి చేసుకున్న ‘జవాన్‌’.. వసూళ్లు ఎంతంటే?

ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా సైఫ్‌ అలీఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నారు. రెండు భాగాలుగా ఇది విడుదల కానుంది. మొదటి పార్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రబృందం నుంచి దసరాకు ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో దీపావళికైనా అప్‌డేట్‌ ఇవ్వాలంటూ అభిమానులు కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు