NTR: ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్‌ పేరుని తీసుకురావద్దు: టీమ్‌ విజ్ఞప్తి

టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్‌ స్పందించింది.

Published : 17 May 2024 18:35 IST

హైదరాబాద్‌: భూ వివాదమై ఎన్టీఆర్‌ (NTR).. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినట్టు వచ్చిన వార్తలపై ఈ హీరో టీమ్‌ స్పందించింది. ఏ ప్లాట్‌ గురించి చర్చ జరుగుతుందో.. దాన్ని 2013లోనే ఎన్టీఆర్‌ విక్రయించారని పేర్కొంది. ఆ వివాదంలోకి ఎన్టీఆర్‌ పేరుని తీసుకురావద్దని విజ్ఞప్తి చేసింది.

‘‘జూబ్లీహిల్స్‌లోని ఓ ప్లాట్‌ని 2003లో ఓ మహిళ నుంచి ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఎప్పటినుంచో పలు బ్యాంకుల వద్ద అదే ప్రాపర్టీ ద్వారా సదరు మహిళ లోన్స్ పొందారు. కానీ, రుణం తీసుకున్న విషయాన్ని దాచిపెట్టి ప్లాట్‌ని అమ్మారు. ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. మరోవైపు, లోన్‌ రికవరీ అంశమై ఆయా బ్యాంకులు డీఆర్‌టీ (డెబిట్‌ రికవరీ ట్రైబ్యూనల్‌)ని ఆశ్రయించగా విచారణ చేపట్టి, ఆ స్థలంపై హక్కులు బ్యాంకులకే ఉంటాయని తీర్పునిచ్చింది. డీఆర్‌టీ తీర్పుపై ఎన్టీఆర్‌ హైకోర్టుని ఆశ్రయించారు’’ అంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని