NTR: ఈ నెల్లోనే ‘వార్‌ 2’ సెట్లోకి!

ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

Updated : 03 Apr 2024 14:02 IST

న్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా కోసం హృతిక్‌ ఇప్పటికే సెట్‌లోకి అడుగు పెట్టగా.. ఎన్టీఆర్‌ ఈ నెల ద్వితీయార్ధం నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నారని సమాచారం. ఇది పది రోజులకు పైగా సాగే చిన్న షెడ్యూల్‌గా ఉండనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కూడా హృతిక్‌ తరహాలోనే స్పైగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న ‘దేవర’ ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఇది రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని