omg 2 telugu ott: ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

అక్షయ్‌కుమార్‌, పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్‌ ఇప్పుడు స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది జియో సినిమా.

Published : 26 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక భాషలో విడుదలైన సినిమాలను ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అక్షయ్‌కుమార్‌, పంజక్‌ త్రిపాఠి, యామి గౌతమ్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఓఎంజీ2’. 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్‌’కు సీక్వెల్‌గా అమిత్‌రాయ్‌ తెరకెక్కించారు. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం హిందీలోనే ఉండటంతో ఇతర భాషల వీక్షకులు నిరాశపడ్డారు. అలాంటివారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది జియో సినిమా. తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీని 4కెలోనూ వీక్షించవచ్చు. మరోవైపు తన సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు అతి తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్‌లను జియో సినిమా తీసుకొచ్చింది. నెలకు రూ.29, రూ.89 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. (పూర్తి వివరాలు..)

OMG2 కథేంటంటే: కాంతి శరణ్‌ ముగ్దల్‌ (పంకజ్‌ త్రిపాఠి) ఆలయం పక్కనే పూజా స్టోర్‌ను నడుపుతుంటాడు. మహా శివ భక్తుడు. భార్య, కొడుకు వివేక్‌ (ఆరుష్‌ వర్మ)తో పాటు తన వద్దే ఉన్న తండ్రిని కూడా ముగ్దల్‌ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు వివేక్‌ అసభ్య ప్రవర్తన కారణంగా పాఠశాల నుంచి బహిష్కరణకు గురవుతాడు. అంతేకాదు, టాయ్‌లెట్‌లో అతడు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్‌ కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు.  ఆ సమయంలో దేవదూత (అక్షయ్‌కుమార్‌) ప్రత్యక్షమవుతాడు. ముగ్దల్‌ కుమారుడు చేసిన పనికి భయపడి పారిపోకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. మరి దేవదూత మాటలు విన్న ముగ్దల్‌ ఎలాంటి పోరాటం చేశాడు? అందుకు అతడు ఎంచుకున్న మార్గం ఏంటి? పరిస్థితి కోర్టు వరకూ ఎందుకు వచ్చింది?అన్నది మిగిలిన కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని