రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్‌ ఫ్రీ కంటెంట్‌, 4K వీడియో క్వాలిటీ

Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది.

Updated : 25 Apr 2024 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీడియో స్ట్రీమింగ్‌ రంగంపై పట్టు సాధించేందుకు జియో సినిమా క్రమంగా సిద్ధమవుతోంది. తాజాగా అందుబాటు ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. పాత ప్లాన్లలోని అధిక ధర, వీడియోలో నాణ్యతలేమి, డివైజ్‌ల సంఖ్య వంటి పరిమితులను తాజాగా అధిగమించింది.

నెలకు రూ.29..

కొత్తగా తీసుకొచ్చిన వాటిలో రూ.29, రూ.89 ప్లాన్‌లు ఉన్నాయి. నెలకు రూ.29 చెల్లిస్తే ఒక డివైజ్‌లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షించొచ్చు. అదీ 4కే వీడియో క్వాలిటీతో. పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. సినిమాలు, హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్మార్ట్‌ టీవీ సహా ఏ డివైజ్‌లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. లైవ్‌ టెలికాస్ట్‌లు, స్పోర్ట్స్‌ మాత్రం యాడ్స్‌తో వస్తాయి.

ఫ్యామిలీ ప్లాన్‌..

ఫ్యామిలీలకూ చేరువ కావడంలో భాగంగా జియో సినిమా రూ.89 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. రూ.29 ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు దీనికి వర్తిస్తాయి. ఇప్పటికే జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ అవుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ను యాడ్స్‌తో ఉచితంగానే వీక్షించొచ్చు.

జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారు ఇంటర్నేషనల్‌ కంటెంట్‌ను స్థానిక భాషల్లోనే ఎంజాయ్‌ చేయొచ్చు. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ వంటి ప్రముఖ సిరీస్‌లు సహా పీకాక్‌, హెచ్‌బీఓ, ప్యారామౌంట్‌, వార్నర్‌ బ్రదర్స్‌, డిస్కవరీ వంటి ప్రధాన స్టూడియోలు నిర్మించిన చిత్రాలు వీక్షించొచ్చు. మోటూ పత్లూ, పోకీమాన్‌ వంటి పిల్లల షోలు సైతం ఉంటాయి. పైగా పిల్లలు చూసే కంటెంట్‌ను తల్లిదండ్రులు నియంత్రించే ఆప్షన్‌ కూడా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని