Sudheer: రష్మితో సినిమా ఎప్పుడు చేస్తారు?సుధీర్‌ సమాధానమిదే..

రష్మి (Rashmi Gautam) హీరోయిన్‌గా సినిమా ఎప్పుడు చేస్తారనే దానికి సుధీర్‌ సమాధానమిచ్చారు. ఆయన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ విడుదల సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు.

Published : 22 Nov 2023 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై పంచ్‌లతో అలరించి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer). అలాగే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక సుధీర్‌-రష్మి జోడికి ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి బుల్లితెర స్క్రిన్‌మీద కనిపిస్తే ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. దీంతో ఈ జోడి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీనికి సుధీర్‌ తాజాగా సమాధానం చెప్పారు.

సుధీర్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన ముచ్చటించారు. రష్మి(Rashmi Gautam) హీరోయిన్‌గా సినిమా ఎప్పుడు చేస్తారనే దానికి సమాధానం చెబుతూ.. ‘నేను, రష్మి ఇద్దరం కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్‌గా నచ్చిన కథ ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం. ఆ ప్రపోజల్ అయితే ఉంది’ అని చెప్పారు.

ఆయనకు నా ప్రాణం తప్ప ఏమివ్వగలను!: చిరుపై వైష్ణవ్‌ తేజ్ కామెంట్స్‌

ఇక ‘కాలింగ్‌ సహస్ర’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఒక సినిమా హిట్‌ అయితే దానికి ముఖ్య కారణం కంటెంట్‌. దీనికి కూడా అదే బలం. సుధీర్‌ను దృష్టిలో పెట్టుకుని కాకుండా ఓ మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలని వెళ్తే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఇది నా మూడో చిత్రం. నా సినిమాలకు నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే వచ్చిన జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఆనందిస్తా. దర్శకుడు ఏది చెబితే అదే నేను చేస్తాను. కానీ, సలహాలు సూచనలు ఏం ఇవ్వను’ అన్నారు. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్‌ సరసన డాలీషా నటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని