ott movies this week: ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే..?

బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్‌లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయో చూసేయండి.

Published : 05 Apr 2024 15:10 IST

మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగులో..

2022లో మలయాళ ప్రేక్షకులను అలరించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఇని ఉత్తరం’. అక్కడ పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ’ విన్‌లో ‘అదృశ్యం’ (Adrishyam ott) పేరుతో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను సుదీశ్‌ రామచంద్రన్‌ తెరకెక్కించారు.


వినోదాల ‘ఏజెంట్‌’

వెన్నెల కిశోర్‌ (Vennela Kishore) ప్రధాన పాత్రలో టీజీ కీర్తికుమార్‌ తెరకెక్కించిన సినిమా ‘చారి 111’ (Chaari 111 ott). సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌. మార్చి 1న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.


‘కిస్మత్‌’ కహానీ

అభినవ్‌, నరేశ్‌ అగస్త్య, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కిస్మత్‌’ (Kismath ott). శ్రీనాథ్‌ బాదినేని దర్శకుడు క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.


షాహిద్‌, కృతి.. ఓ లవ్‌ స్టోరీ

షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌ జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ (teri baaton mein aisa uljha jiya ott). అమిత్‌ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.


హారర్‌ థ్రిల్లర్‌ ‘తంత్ర’

అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘తంత్ర’ (tantra movie ott). దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. సలోని, ధనుష్‌ రఘుముద్రి, వంశీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 15న థియేటర్‌లో విడుదలైన తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


మరికొన్ని భాషల్లో హనుమాన్‌

థియేటర్‌లో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్‌’ (Hanuman ott) ఓటీటీలో తెలుగు భాషలోనూ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇతర భాషల సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.


స్వచ్ఛమైన ప్రేమ కథ

నవీన్‌ గాంధీ. దర్శకత్వంలో భరత్‌ రాజ్‌, దివి జంటగా నటించిన చిత్రం ‘లంబసింగి’ (lambasingi). టి.ఆనంద్‌ నిర్మాత. మార్చిలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. వాస్తవికతకు దగ్గరగా మూవీ తీశారంటూ ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది.


ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు

 • అమెజాన్‌ ప్రైమ్‌
 • జుని (కన్నడ)
 • హౌ టు డేట్‌ బిల్లీ వ్లాష్‌ (ఇంగ్లీష్‌)
 • మ్యూజికా (ఇంగ్లీష్‌)
 • యహ్‌ మేరీ ఫ్యామిలీ (హిందీ) ప్రైమ్‌
 • జీ5
 • ఫర్రే (హిందీ)
 • లా వస్తే (హిందీ)
 • ఆహా
 • మిషన్‌ చాప్టర్‌-1: (తమిళ్‌)
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • విష్‌ (ఇంగ్లీష్‌)
 • నెట్‌ఫ్లిక్స్‌
 • డోంట్‌ వాంట్‌ వర్సీ డార్లింగ్‌ (ఇంగ్లీష్‌/హిందీ)
 • ఎల్విస్‌ (ఇంగ్లీష్‌)
 • స్మైల్‌ (ఇంగ్లీష్‌/హిందీ)
 • కన్‌ఫెస్‌ ఫ్లెట్చ్‌ (ఇంగ్లీష్‌ /హిందీ)
 • క్రూక్స్‌ (ఇంగ్లీష్‌)
 • లెగో నింజాగో (ఇంగ్లీష్‌)
 • ఐ వోక్‌ అప్‌ వాంపైర్‌ (ఇంగ్లీష్‌)
 • జియో సినిమా
 • బెల్‌ (తమిళ్‌)
 • సోనీలివ్‌
 • ఫ్యామిలీ ఆజ్‌ కల్‌ (హిందీ)
 • ది ఉమెన్‌ కింగ్‌ (ఇంగ్లీష్‌/తమిళ్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని