అవన్నీ అవాస్తవాలే.. ఫ్యాన్‌ క్లబ్స్‌కు నటి వార్నింగ్‌

సోషల్‌మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తోన్న పలు ఫ్యాన్‌ పేజీలకు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) వార్నింగ్‌ ఇచ్చారు.

Published : 26 Nov 2023 10:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్యాన్‌ క్లబ్స్‌, ఫ్యాన్‌ పేజీల తీరుపై బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

‘‘నా పేరుని ఉపయోగించి కొన్ని ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటీనటులకు ఫేవర్‌గా పోస్టులు క్రియేట్‌ చేస్తున్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి లేదా అభినందించడానికి నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదు. ఇలాంటివి రిపీటైతే.. రిపోర్ట్‌ చేస్తా. మీరు ఏదైనా పోస్టు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’’ అని ఆమె తెలిపారు. అయితే, ఆమె ఉన్నట్టుండి ఇలా రియాక్ట్‌ కావడానికి కారణం ఏమిటి? అనేది మాత్రం పూర్తిగా చెప్పలేదు.

Hi Nanna: రానున్న డిసెంబర్‌ ఫాదర్స్‌ మంత్‌.. ఎందుకంటే: నాని

2011లో బాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు పరిణీతి చోప్రా. ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘కిల్‌ దిల్‌’, ‘డిష్యూం’, ‘కేసరి’, ‘సైనా’, ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ చిత్రాల్లో ఆమె నటించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, ఎంపీ రాఘవ్‌ చద్దాను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని