Hi Nanna: అలా చేసుంటే.. ‘హాయ్‌ నాన్న’ ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ

‘హాయ్‌ నాన్న’పై పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Updated : 07 Jan 2024 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాని, మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ  (Paruchuri Gopala Krishna) విశ్లేషించారు.

‘‘నాని ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు. ఇది మంచి ప్రేమకథ. బిడ్డలను వద్దు అనుకునే భార్యని.. భర్త ఒప్పించాక ఏం జరిగిందన్నది ఇందులో చూపించారు. ఈ సినిమా హిట్ కావడానికి ముఖ్య కారణం స్క్రీన్‌ప్లేనే. ఊహకు అందకుండా సినిమాను తీయడం ఒక కళ. శౌర్యువ్‌కు ఈ కళ బాగా ఉంది. అప్పటి హీరోలు నాగేశ్వరరావు, శోభన్‌ బాబుల బాడీ లాంగ్వేజ్‌ నానిలో (Nani) ఎక్కువగా ఉంటుంది.

ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. యాక్సిడెంట్‌ కారణంగా గతం మర్చిపోయిన భార్యకు భర్త ఎలా గుర్తుచేశాడన్నది చాలా బాగా చూపించారు. మొదటి భాగంలో భార్యాభర్తల బంధాన్ని చూపించి.. ఆ తర్వాత వాళ్ల బిడ్డ బతుకుతుందా.. లేదా..? అనే అంశంతో కథను ముందుకు తీసుకెళ్లాడు. సినిమా అంతా హీరోహీరోయిన్‌ పాత్రలే కాకుండా.. మధ్యలో కూతురు సెంటిమెంట్‌ను జోడించి కథనాన్ని నడిపించారు. అందుకే హిట్‌ అయింది. కథలో బలం లేకపోతే ఏడాది పాటు కష్టపడి తీసినా.. వారం రోజులు కూడా థియేటర్లో ఉండదు. ఈ సినిమా నిడివి తగ్గించొచ్చు. 2 గంటల 36 నిమిషాలు ఉంది. చివర్లో పది నిమిషాలు కట్‌ చేయొచ్చు. అలా చేసి ఉంటే ఇంకా బాగుండేదని సీనియర్‌ రచయితగా నా అభిప్రాయం.

నాపై నమోదైన పరువునష్టం దావాపై స్టే విధించండి: కంగనా రనౌత్‌

ఇందులో పెళ్లి సన్నివేశాన్ని గుండెలకు హత్తుకునేలా తీశారు. దర్శకుడు అనుకుంటే అక్కడ రెండు ఫైటింగ్‌ సీన్స్‌ పెట్టొచ్చు.  ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించడం కోసం అలాంటివి పెట్టలేదు. డైలాగులు కూడా సరళంగా రాశారు. ఆడియన్స్‌తో ఈలలు వేయించాలని రచయిత అనుకోలేదు. వాళ్ల మనసును గెలవాలనుకున్నారు. బతకడం కష్టం అనుకునే పాపను తండ్రి రక్షించుకున్న తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చాలా బాగుంది’’ అంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని