Pawan kalyan: భార్యతో ఇటలీకి పవన్‌కల్యాణ్‌.. ఫొటోలు వైరల్‌

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబసమేతంగా ఇటలీ బయల్దేరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Published : 29 Oct 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ కుటుంబసమేతంగా ఇటలీకి బయల్దేరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌ విమానాశ్రయంలో పవన్ సింపుల్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు. న్యూ లుక్‌ బాగుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

హీరో వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya Tripathi) పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి కోసమే పవన్‌ ఇటలీ వెళ్తున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి చేరుకున్నారు. అలాగే నిన్న వరుణ్ తేజ్‌, లావణ్య కూడా ఇటలీ వెళ్లారు. ఇక మెగా-అల్లు ఫ్యామిలీ సభ్యులు కూడా నేడు వెళ్లనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ పెళ్లి సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే, ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక నవంబర్‌ 5న సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. తాజాగా పెళ్లి వెడ్డింగ్‌ కార్డుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. ఈ సందర్భంగా #Varunlav అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని