payal rajput: బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్‌ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్‌ రాజ్‌పుత్‌

తనను టాలీవుడ్‌ నుంచి బ్యాన్‌ చేస్తామని మూవీ టీమ్‌ బెదిరిస్తున్నట్లు పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపారు.

Updated : 20 May 2024 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌ నుంచి తనను బ్యాన్‌ చేస్తామని ఓ మూవీ మేకర్స్‌ బెదిరిస్తున్నట్లు వెల్లడించారు.

‘2020లో ‘రక్షణ’ (5Ws) అనే చిత్రంలో నటించాను. ఈ సినిమా విడుదల ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల కాలంలో నా సినిమాలు విజయం సాధించడంతో ఆ సక్సెస్‌ను ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. నేను రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. రెమ్యునరేషన్‌ చెల్లిస్తే డిజిటల్‌  ప్రమోషన్స్‌ చేస్తానని చెప్పినప్పటికీ ఫలితం లేదు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో వాళ్లు నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ రాజ్‌పుత్ (payal Rajput) తెలిపారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో పాయల్‌ ప్రధానపాత్రలో ‘రక్షణ’ (Rakshana) తెరకెక్కింది. ఈ సినిమా జూన్‌7న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు.

ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్‌ గురించి ఈ సంగతులు తెలుసా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని