Ponniyin selvan 2 ott release: ఓటీటీలోకి ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’.. ఆ నిబంధన తొలగింపు

ponniyin selvan 2 ott release date: విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, జయం రవి, త్రిష, కార్తి కీలక పాత్రల్లో నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ ఓటీటీలోకి వచ్చేసింది.

Updated : 02 Jun 2023 12:31 IST

హైదరాబాద్‌: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక యాక్షన్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఏప్రిల్‌ 28న ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. (ponniyin selvan 2 ott release) అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పటి వరకు అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఇకపై అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లందరూ ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఇంతకీ పార్ట్‌-2 క‌థేంటంటే: చోళ యువ‌రాజు అరుణ్‌మొళి వ‌ర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వ‌న్ (జ‌యం ర‌వి) త‌న‌పైకి వ‌చ్చిన శ‌త్రుమూక‌లతో పోరాడుతూ స‌ముద్రంలో మునిగిపోవ‌డంతో తొలి భాగం క‌థ ముగుస్తుంది.  అరుణ్‌మొళికి ఎప్పుడు ఆప‌ద వ‌చ్చినా కాపాడే ఓ వృద్ధురాలు ఈసారి కూడా అత‌ని కోసం స‌ముద్రంలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. నందిని (ఐశ్వ‌ర్య‌రాయ్‌) పోలిక‌ల‌తో క‌నిపించే ఆ వృద్ధురాలు ఎవ‌రు? ఈసారి వ‌చ్చిన  ఆప‌ద నుంచి అరుణ్‌మొళిని ఆమె కాపాడిందా లేదా? వీరపాండ్య హ‌త్య‌కి ప్ర‌తీకారంగా చోళ రాజుల్ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా వేచి చూస్తున్న పాండ్య సైన్యం ల‌క్ష్యం నెర‌వేరిందా? మ‌రోవైపు  మ‌ధురాంత‌కుడి (రెహ‌మాన్‌)ని చోళ రాజ్యానికి  ప‌ట్ట‌పురాజుని చేయాల‌ని సొంత రాజ్యంలోనే  న‌డుస్తున్న  రాజ‌కీయాలు ఎంత‌వ‌ర‌కు చేరాయి? త‌న‌పై మ‌న‌సుప‌డిన ఆదిత్య క‌రికాలుడు (విక్ర‌మ్‌)ని వ్యూహం ప్ర‌కారం త‌న కోట‌కి ర‌ప్పించిన నందిని అత‌డిని ఏం చేసింది? అస‌లు 9వ శ‌త‌కంలో చోళ సామ్రాజ్యంలో ఏం జరిగింద‌నేది రెండో భాగం సినిమాలోని క‌థ‌.

‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని