Prabhas: ఎక్స్‌లో ప్రభాస్ రికార్డు.. ఏకైక హీరోగా గుర్తింపు

ఎక్స్‌లో గతేడాది ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్స్‌లో ప్రభాస్‌ పేరు ఉండడంతో అభిమానులు సంబరపడుతున్నారు.

Published : 14 Mar 2024 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ‘బాహుబలి’తో ఈ స్టార్‌ హీరో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ప్రభాస్ ఓ అరుదైన రికార్డును దక్కించుకున్నారు. ట్విట్టర్‌లో గతేడాది ఎక్కువ వాడిన హ్యాష్‌ట్యాగ్స్‌ల జాబితాలో ప్రభాస్‌ పేరు టాప్‌ ప్లేస్‌లో ఉంది. సంవత్సరంపాటు మన దేశంలో నెటిజన్లు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్స్‌ తాజాగా ప్రకటించింది. ‘టాప్‌ హ్యాష్‌ట్యాగ్స్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో ప్రభాస్ హ్యాష్‌ట్యాగ్‌ ఏడో స్థానంలో ఉంది. అలాగే ఈ హీరో నటించిన ‘ఆదిపురుష్‌’ తొమ్మిదో స్థానంలో ఉండడం విశేషం. ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక హీరో ప్రభాస్‌ కావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

జపాన్‌లో ‘ఆర్ఆర్‌ఆర్‌’ క్రేజ్‌.. ఒక్క నిమిషంలో థియేటర్‌ హౌస్‌ఫుల్‌

ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. దీనితో పాటు డైరెక్టర్‌ మారుతి- ప్రభాస్‌ల కాంబోలో ‘రాజాసాబ్’ రూపొందుతోంది. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో  రానున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.  ఇవి పూర్తయ్యాక సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’లో నటిస్తారు ప్రభాస్‌. అలాగే, ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో ‘సలార్‌ పార్ట్‌ 2’ రూపొందనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని