kalki: ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898’(Kalki2898AD). ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు.

Updated : 24 Feb 2024 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతూనే ఉంది.

ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వీటిపై చిత్రం బృందం క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌కి సంబంధించిన ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ క్యాప్షన్‌తో వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం మే 9న విడుదలకానుందని పేర్కొంది. 

‘కల్కి’లో ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తున్నారు. కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan), పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని