Prabhas: ప్రభాస్‌ భారీ విరాళం.. నిజమేనా?

అయోధ్యలోని రాముడి ఆలయానికి ప్రభాస్‌ (Prabhas) భారీగా విరాళం ఇచ్చారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన టీమ్‌ స్పందించింది.  

Updated : 19 Jan 2024 17:53 IST

హైదరాబాద్‌: అయోధ్య రామ మందిరానికి నటుడు ప్రభాస్‌ (Prabhas) రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారని, ప్రారంభోత్సవం నాడు భోజనాల ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకోనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై ప్రభాస్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. వాటిని ఏమాత్రం నమ్మొద్దని కోరింది.

Rashmika: ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు..: రష్మిక

ప్రతిష్ఠాత్మక రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. సినీ, రాజకీయ, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ప్రభాస్‌కు సైతం ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రూ.50 కోట్లు విరాళం  ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భోజనం ఖర్చులు ప్రభాస్‌ పెట్టుకుంటున్నారని చెప్పారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయా కథనాలపై స్పష్టత కోసం ఆంగ్ల వెబ్‌సైట్‌ తాజాగా ప్రభాస్‌ టీమ్‌ను సంప్రదించగా అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టతనిచ్చింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘సలార్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన నాగ్‌ అశ్విన్‌తో ‘కల్కీ 2898 ఏడీ’ (Kalki 2898 AD), మారుతీతో ‘రాజాసాబ్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. వీటి తర్వాత ‘సలార్‌ శౌర్యాంగపర్వం’ కోసం సిద్ధం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని