Rashmika: ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు..: రష్మిక

నటి రష్మిక (Rashmika) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 19 Jan 2024 15:28 IST

హైదరాబాద్‌: ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక (Rashmika). ఇటీవల ‘యానిమల్‌’ (Animal)తో విజయాన్ని అందుకున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ షూటింగ్‌ అనుభవాలను పంచుకున్నారు. ఈసందర్భంగా తన తదుపరి చిత్రాలైన ‘పుష్ప 2’, ధనుష్‌ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘యానిమల్‌’ (Animal) కోసం రణ్‌బీర్‌ కపూర్‌తో వర్క్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సందీప్‌ ఆలోచనా విధానం చూసి షాకయ్యా. రణ్‌బీర్‌ను కొట్టే సన్నివేశం నటిగా నాకొక సవాల్‌ అనిపించింది. ఒక్క టేక్‌లోనే ఆ సీన్‌ షూట్‌ చేశాం. సందీప్‌ సీన్‌ను వివరించి.. పరిస్థితిని ఫీలవ్వాలని చెప్పారు. కేవలం ఆ ఒక్క మాటే నాకు గుర్తుంది. యాక్షన్‌, కట్‌ మధ్యలో ఏం జరిగిందో గుర్తు లేదు. రణ్‌బీర్‌ మీద కేకలు వేశా. కోపంతో అతడిని చెంపపై కొట్టా. షాట్‌ ఓకే అని దర్శకుడు చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశా. తర్వాత రణ్‌బీర్‌ వద్దకువెళ్లి.. ‘అంతా ఓకేనా’ అని అడిగా. ‘యానిమల్‌’ సీక్వెల్‌ విషయంలో సందీప్‌ ఎంతో క్లారిటీతో ఉన్నారు. పార్ట్‌ 1కు వచ్చిన స్పందనలను దృష్టిలో ఉంచుకుని తను అనుకున్నది స్క్రీన్‌పైకి తీసుకువస్తారు’’

Naga Vamsi: ‘గుంటూరు కారం’.. ఆ విషయం ముందే చెప్పాల్సింది: నాగవంశీ

‘‘పుష్ప 2’ గురించి నేను ఒకే ఒక్క మాట చెప్పగలను. మీరు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ఉండనుంది. ‘పుష్ప ది రైజ్‌’ సక్సెస్‌తో మాపై బాధ్యత పెరిగింది. ఇటీవల నేను ఒక పాట షూట్‌లో పాల్గొన్నా. ఇది ముగింపు లేని కథ. మనం అనుకున్నట్లు  దీనిని తీర్చిదిద్దవచ్చు. ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఇందులో నా పాత్ర చాలా మెరుగ్గా ఉంటుంది. శేఖర్‌ కమ్ముల - ధనుష్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు