Prasanth Varma: రణ్‌వీర్‌ లుక్‌టెస్ట్‌ పూర్తయింది: రూమర్స్‌పై స్పందించిన ప్రశాంత్ వర్మ

రణ్‌వీర్‌ సింగ్‌తో చేయనున్న ప్రాజెక్ట్‌పై వస్తోన్న రూమర్స్‌ గురించి ప్రశాంత్ వర్మ స్పందించారు. లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలిపారు.

Published : 27 May 2024 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రణ్‌వీర్‌ -  ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్‌ గురించే వినిపిస్తుంది. ‘రాక్షస’ (#Rakshasa) అనే టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్‌. ఈ సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ వైదొలగినట్టు జోరుగా ప్రచారమవుతోంది. తాజాగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ రూమర్స్‌పై స్పందించారు. ‘రణ్‌వీర్‌ సింగ్‌ యాక్టింగ్‌ స్టైల్ భిన్నంగా ఉంటుంది. కానీ, దక్షిణాదిలో నటుల పనితీరు వేరుగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఒక టీమ్‌లా పనిచేస్తారు. ఎవరూ మరొకరిపై అధికారం చేయాలని చూడరు. రణ్‌వీర్‌తో సినిమాపై ఎన్నో రూమర్స్‌ వస్తున్నాయి. అరగంట సీన్‌ను నాలుగు రోజులు తీశారనే చర్చ వాస్తవం కాదు. ఈ ప్రాజెక్ట్‌ కోసం రణ్‌ వీర్‌ (Ranveer Singh) లుక్‌ టెస్ట్‌ పూర్తయింది. ఈ రూమర్స్‌ ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయో తెలియడం లేదు. అయినా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడం నాకు నచ్చదు’ అని చెప్పారు.

మే చివరి వారం.. థియేటర్‌లో అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?

మరోవైపు ఈ ప్రాజెక్ట్‌  క్రియేటివ్‌ డిఫరెన్స్‌ల వల్ల ఆగిపోలేదని.. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే నిర్మాణ సంస్థ ప్రకటించనున్నట్లు తెలిపింది. మైథలాజికల్‌ టచ్‌ ఉన్న పీరియాడికల్‌ డ్రామాగా ఇది తెరకెక్కుతున్నట్లు సమాచారం. రూ.200కోట్లతో పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘హనుమాన్‌’ (Hanuman)కు సీక్వెల్‌గా రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని