Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్‌ వర్మ సినిమా!.. బడ్జెట్‌ ఎంతంటే..

బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో ప్రశాంత్‌ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్‌.

Published : 18 Apr 2024 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హనుమాన్‌’తో బాగా పాపులర్‌ అయ్యారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడీ స్టార్‌ డైరెక్టర్‌కు అన్ని భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘జై హనుమాన్‌’తో బిజీగా ఉన్న ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడితో ఆయన సినిమా తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీటౌన్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రశాంత్‌ వర్మ ఒక సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘హనుమాన్’ రణ్‌వీర్‌కు తెగ నచ్చేసిందని.. దీంతో ఆ డైరెక్టర్‌తో మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని తరహాలోనే మైథలాజికల్‌ టచ్‌ ఉన్న పీరియాడికల్‌ డ్రామా తీయాలని భావిస్తున్నారట. దీని కోసం ఇప్పటికే ఇద్దరూ పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రూ.200కోట్లతో దీని రూపొందించనున్నట్లు టాక్‌. పాన్ ఇండియా స్థాయిలో ఇది ఉండనుందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘హనుమాన్‌’ (Hanuman)కు కొనసాగింపుగా ఇది రానుంది. తాజాగా దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ.. జీవితాంతం గుర్తుపెట్టుకునేలా తెరకెక్కిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. జనవరిలో ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. త్వరలోనే షూట్‌ ప్రారంభించనున్నారు. గత చిత్రంతో పోలిస్తే సీక్వెల్‌ 100 రెట్లు భారీ స్థాయిలో ఉండనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు