Prashanth Neel: ఆ విషయాన్ని షారుక్‌ ఖాన్‌ నిరూపించారు..: ప్రశాంత్ నీల్‌

ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) నటించిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 21 Dec 2023 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీఎఫ్‌’ ప్రాజెక్ట్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. దీంతో ఆయన సినిమా వస్తుందంటే యాక్షన్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సలార్‌’ (Salaar). మరికొన్ని గంటల్లో (డిసెంబర్‌ 22) ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel) ‘సలార్‌’ విశేషాలను పంచుకున్నారు. 

‘‘ఉగ్రం’ తర్వాత పెద్ద చిత్రం కోసం ప్రణాళికలేం రచించుకోలేదు. ‘కేజీఎఫ్‌’ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ‘సలార్‌’ కూడా పాన్‌ ఇండియా మూవీ అవుతుందని అప్పుడు తెలియలేదు. స్క్రిప్ట్‌ రాసుకున్నా. దాన్ని ప్రేక్షకులకు ఎలా చూపించాలా అని ఆలోచించా. పాన్‌ ఇండియా సినిమాల కోసం ప్రత్యేకంగా ప్లాన్‌లు ఏం ఉండవు. సినిమా బాగుంటే దానికి ఆ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో ఇందులో చూపించాం. భారీ బడ్జెట్‌ చిత్రాల్లో కథకు, పాత్రలకు సమానమైన ప్రాధాన్యతనివ్వాలి. హీరోగా నటించే వ్యక్తి స్థానంలో పాత్ర కనిపించాలి గానీ.. హీరో కనిపించకూడదు. ఇందులో దేవ పాత్రలో ప్రభాస్ అలానే నటించాడు. ఆ పాత్రలో ఒదిగిపోయాడు’’ అన్నారు.

డంకీ.. ఈ ఏడాది షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టారా..?

ఇక ప్రభాస్‌ (Prabhas) గత చిత్రాలపై స్పందించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘‘ప్రభాస్‌ పెద్ద స్టార్‌. ‘బాహుబలి’ తర్వాత ఆయన అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. స్టార్‌ హీరో ఎప్పటికీ స్టార్‌ హీరోనే. ఒక్క హిట్‌తో పూర్వవైభవాన్ని పొందగలరు. ఇటీవలే ఈ విషయాన్ని షారుక్‌ (Shah Rukh Khan) నిరూపించారు. అది ఎవరూ కాదనలేని వాస్తవం’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని