premalu ott release:: న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది!

premalu ott release date telugu: యువతను విశేషంగా ఆకట్టుకున్న సరికొత్త చిత్రం ‘ప్రేమలు’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 03 Apr 2024 00:03 IST

హైదరాబాద్‌: రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ.85 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu). నస్లెన్‌ కె.గఫూర్‌ , మ్యాథ్యూ థామస్‌ , మమితా బైజూ ప్రధాన పాత్రల్లో గిరీశ్‌ ఎ.డి. తెరకెక్కించారు. మార్చి 8న తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించింది.  కొత్త‌ త‌రం ప్రేమ‌క‌థ‌తో, హైద‌రాబాద్ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ (Premalu ott release date) అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాట్‌స్టార్‌ పోస్టర్‌ను పంచుకుంది. ‘ఈ ప్రేమ మరింత వైరల్‌ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది.

క‌థేంటంటే: స‌చిన్ సంతోష్ (నాస్లెన్ కె.గ‌ఫూర్‌) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విష‌యాన్ని చెప్పేందుకు ధైర్యం స‌రిపోదు. కాలేజీలో చివ‌రిరోజు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్ప‌టికే వేరొక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమ‌లో విఫ‌ల‌మైన స‌చిన్‌... యూకే వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే వీసా రాదు.  దాంతో గేట్ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్ర‌తాప్‌)తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకుంటాడు. అక్క‌డే రీనూ (మ‌మిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుక‌లో వీరిద్దరూ క‌లుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమ‌లో ప‌డిపోతాడు. మ‌రి ఈసారైనా స‌చిన్ ప్రేమక‌థ సుఖాంత‌మైందా? లేక మ‌ళ్లీ అత‌ని హార్ట్ బ్రేక్ అయ్యిందా? అన్నది మిగిలిన కథ.

‘ప్రేమలు’ మూవీ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని