Salaar 2: ‘సలార్‌2’పై అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీక్వెల్‌ ‘సలార్‌2’. తాజాగా దీనిపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 11 Mar 2024 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ (Salaar: Ceasefire). గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో దీని రెండోభాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దీనిపై అప్‌డేట్‌ ఇచ్చారు.

‘నేను ప్రభాస్‌ మంచి స్నేహితులం. ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్‌లో ఉంటాం. సలార్‌ రెండో భాగం షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారభం కానుంది’ అని చెప్పారు. ఇటీవల నటుడు బాబీసింహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్‌ పార్ట్‌2 కథ సిద్ధంగా ఉందని.. ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది దీని విడుదలకు ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. దీంతో వచ్చే నెలలో సలార్‌ సెట్స్‌ పైకి వెళ్లడం ఖాయమంటున్నారు అభిమానులు.

ఈ వారం థియేటర్‌లో 10కి పైగా చిత్రాలు.. ఓటీటీలో ‘హను-మాన్‌’ ఇంకా ఎన్నో..!

పార్ట్‌ 2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రూపొందించనున్నారు. ఎన్నో ప్రశ్నలతో మొదటి భాగాన్ని ముగించిన ప్రశాంత్‌ నీల్.. రెండో పార్ట్‌లో వాటికి ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకులు ఈ సీక్వెల్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. దీని చిత్రీకరణ తుది భాగానికి చేరుకుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab)లోనూ ప్రభాస్ నటిస్తోన్నారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని