Priyamani: దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్‌ వర్సెస్‌ నార్త్‌పై ప్రియమణి కామెంట్స్‌

దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు.

Updated : 29 Mar 2024 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే చర్చ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికే పలువురు తారలు ఈవిషయంపై స్పందించారు. తాజాగా నటి ప్రియమణి (Priyamani)ఈ అంశంపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘ప్రస్తుతం దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నారు. సౌత్‌ ఇండియాకు సంబంధించిన పాత్ర కాబట్టి మీకు అవకాశమిస్తున్నామని కొందరు బాలీవుడ్‌ దర్శకులు అంటుంటారు. త్వరలోనే ఈ ధోరణిలోనూ మార్పు రావాలని కోరుకుంటున్నా. మేము ఇక్కడి వాళ్లమే అయినా.. హిందీ భాషను అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా రంగు నార్త్‌ వాళ్లంత ఫెయిర్‌గా ఉండదంతే. కానీ అది పెద్ద విషయమేమీ కాదు. సౌత్ నుంచి వచ్చే నటీనటులకు అన్ని భాషలపైనా అవగాహన ఉంటుంది. డైలాగులు చెప్పేటప్పుడు గ్రామర్‌ తప్పులు ఉన్నా.. భావోద్వేగాలను సరిగ్గా పండిస్తాం. అయినా.. నార్త్‌, సౌత్ అన్న వ్యత్యాసం చూడకూడదు. అందరూ భారతీయ నటీనటులే’ అని అన్నారు.

ఇక ప్రియమణి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయ్యారు. గతేడాది రెండు సూపర్‌ హిట్లు అందుకున్న ఆమె ప్రస్తుతం ‘మైదాన్‌’ కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా అమిత్‌శర్మ దీనిని తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని