Priyanka Chopra: ఆడపులి పాత్రకి ప్రియాంక గళం

బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సీనియర్‌ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడో కొత్త పాత్రకు సిద్ధమైంది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ నిర్మిస్తున్న ‘టైగర్‌’ అనే చిత్రంలోని అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువివ్వనుంది.

Updated : 03 Apr 2024 14:00 IST

బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సీనియర్‌ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడో కొత్త పాత్రకు సిద్ధమైంది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ నిర్మిస్తున్న ‘టైగర్‌’ అనే చిత్రంలోని అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువివ్వనుంది. ఏప్రిల్‌ 22న ఈ డాక్యుమెంటరీ చిత్రం విడుదలవుతోంది. ఈ విషయాన్ని  మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేస్తూ.. చిత్ర పోస్టర్‌ని పంచుకుంది ప్రియాంక. ‘అపురూపమైన ఈ కథలోని ముఖ్య పాత్రకు నా గళం అందివ్వడం సంతోషంగా ఉంది. ఒక పులి ఎనిమిదేళ్ల జీవితాన్ని, అడవిలోని ఎన్నో నిగూఢ విషయాల్ని వెలికితీసే ఈ ప్రాజెక్టులో భాగమవ్వడాన్ని చాలా ఎంజాయ్‌ చేశా’ అంటూ వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని