Pawan kalyan: ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)పై నిర్మాత అప్‌డేట్‌ ఇచ్చారు.

Updated : 27 Feb 2024 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమా నుంచి అప్‌డేట్స్‌ లేకపోవడంతో ఆగిపోయిందంటూ రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వాటన్నిటికీ చెక్‌ పెట్టారు నిర్మాత ఏఎమ్‌ రత్నం. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు.

‘పవన్‌కల్యాణ్‌తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్‌ తీసుకొని ఏదోఒకటి తీయెచ్చు. కానీ, ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తోన్న మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. దాన్ని నమ్మకండి. ‘హరిహర వీరమల్లు’ ఆగిపోలేదు. దీనికి రెండో భాగం కూడా ఉంటుంది. ఈ చిత్రంతో పవన్‌ కల్యాణ్‌ మరోస్థాయికి వెళ్తారు’ అని చెప్పారు. దీంతో పవన్‌ అభిమానులు సంబరపడుతున్నారు. గతంలోనూ ఓ సందర్భంలో నిర్మాత  మాట్లాడుతూ.. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇరాన్‌, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయన్నారు. ఇది ఫ్యాన్స్‌ ఊహకు మించి ఉండనుందన్నారు.

అందరి చూపు.. ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌ వైపు.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో పవన్‌ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఆయన ఔరంగజేబు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి  కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు